నిజంనిప్పులాంటిది

Jan 25 2024, 13:15

ఫిబ్రవరి నెలలో మంత్రులు ఎవరు అయోధ్యకు వెళ్లకూడదు: ప్రధాని

కేంద్ర మంత్రులు ఎవరూ కూడా అయోధ్య రామాలయ దర్శనానికి వెళ్లకూడదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఇటీవలే ప్రాణప్రతిష్ట జరిగిన రామాలయానికి భారీ సంఖ్యలో భక్తులు, యాత్రికులు తరలివ స్తున్నారు.

దీనితో రద్దీని నియంత్రిం చేందు కు చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉందని అయోధ్య స్థానిక అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో తమ మంత్రివర్గ సహచరులకు ప్రధాని నుంచి సంబంధిత విషయంలో బుధవారం సూచనలు వెలువడ్డాయి.

మంత్రులు తమ విఐపి, వివిఐపి హోదాలలో రద్దీ దశలో అయోధ్యకు వెళ్లితే తలెత్తే పరిస్థితిని దృష్టిలోతీసుకుని ప్రధాని మోడీ నుంచి ఈ విషయంలో ఆదేశాలు వెలువడినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఫిబ్రవరి వదిలేసి, మంత్రులు అయోధ్యకు మార్చి నెలలో వెళ్లవచ్చునని, అప్పటివర కూ తమ పర్యటన వాయిదా వేసుకోవాలని ప్రధాని కోరినట్లు వెల్లడించారు. బుధవారం కేంద్ర కేబినెట్ సమావే శం జరిగింది. ఈ దశలో అయోధ్యలో రామాలయంలో ప్రాణప్రతిష్ట, దీనిపై ప్రజాస్పందన గురించి మంత్రులను ప్రధాని ప్రశ్నించినట్లు వెల్లడైంది.

యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉంటోందని, దూర ప్రాంతాల నుంచి బాలరాముడిని చూసేందుకు జనం తరలివస్తున్నారని, విశేష స్పం దన ఉందని మంత్రులు ప్రధానికి వివరించినట్లు తెలిసింది. 22న రామాలయ ప్రాణప్రతిష్ట ఘట్టం ఘనంగా జరిగింది. ప్రధాన ఘట్టానికి ఆహ్వానితులుగా తరలివచ్చిన విశిష్టులు ఆ తరువాత ప్రత్యేకంగా బాలరాముడిని సందర్శించుకున్నారు.

మరుసటి రోజు మంగళవారం నుంచి దర్శనం సార్వత్రికం అయింది.తొలిరోజునే దాదాపు ఐదులక్షల మంది వరకూ దర్శనం చేసుకున్నారు. ఈ సంఖ్య ఈ వారాంతంలో మరింత పెరుగుతుందని, ఫిబ్రవరి అంతా కూడా ఇదే విధంగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

మంళవారం తెల్లవారు జామున మూడు గంటలకు దర్శనానికి భక్తులు బారులు తీరారు. కాగా జనం కిక్కిరిసిన దశలో కొద్ది సేపు దర్శనం నిలిపివేయాల్సి వచ్చింది. ఆలయం ప్రాంగణం, అయోధ్యలో పలు ప్రాంతాలలో జనం కిక్కిరిసి ఉన్నారు. దీనితో పరిస్థితిని సమీక్షించుకుని అధికారులు రోజంతా అయోధ్యకు వచ్చే వాహనాలను శివార్లకు చాలా దూరంలోనే నిలిపివేశారు.

పరిస్థితిని సమీక్షించిన తరువాతనే ఈ వాహనాల ను అయోధ్యలోకి పంపించేందుకు వీలుం టుందని తెలిపారు. నెలరోజుల పాటు మంత్రులు, ఉన్నతా ధికారులు, సెలబ్రిటీలు ఎవరూ కూడా దర్శనానికి రాకుండా ఉండటం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.

ఈ విషయాన్ని ప్రధానికి తెలియచేయడంతో, దీనికి అనుగుణంగానే ప్రధాని ఇప్పుడు మంత్రులకు దీనిపై తగు సలహాలు వెలువరిం చినట్లు వెల్లడైంది.

నిజంనిప్పులాంటిది

Jan 25 2024, 10:37

హైదరాబాదులోనేడు ఇంగ్లాండ్ v/s భారత్ టెస్ట్ మ్యాచ్ సిరీస్

భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్ ఇవాళ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ప్రారంభం కానుంది.

ఈ నెల 29 వరకు భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరగనుంది.

ఈ నేపథ్యంలో రాచకొండ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

శాంతి భద్రతల పోలీసులతో పాటు ఆక్టోపస్, ట్రాఫిక్, ఆర్మ్డ్ ఫోర్స్, ఎస్ బీ, సీసీఎస్, ఎస్ఓటీ, ఐటీ సెల్ వంటి అన్ని ప్రత్యేక విభాగాల నుంచి 1,500 పోలీసు బలగాలతో బందోబస్తును ఏర్పాటు చేశారు.

నిజంనిప్పులాంటిది

Jan 25 2024, 10:36

త్వరలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ ప్రజలకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. జిల్లాలో అర్హులైన వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు పంపిణీ చేయనున్నట్టు.. హైదరాబాద్‌ జిల్లా ఇంఛార్జ్‌, మంత్రి పొన్నం ప్రభాకర్‌ బుధవారం కీలక ప్రకటన చేశారు.

జిల్లా అభివృద్ధి, సంక్షేమంతో పాటు పెండింగ్‌ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన మంత్రి పొన్నం ఈ ప్రకటన చేశారు. జిల్లాలో ఏడు ప్రాంతాల్లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు.

జీహెచ్‌ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుని డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కేటాయించనున్నట్టు తెలిపారు.జిల్లా అధివృద్ధిలో ప్రభుత్వం, అధికారులు కలిసి పని చేయాలని సూచించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా జిల్లాలో చేపల మార్కెట్లు కొత్తగా నిర్మించే ఆలోచన ఉందని మంత్రి పొన్నం వివరించారు. అవసరమైతే ప్రతి మండలంలో ఒక చేపల మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి పొన్నం ఆదేశించారు....

నిజంనిప్పులాంటిది

Jan 25 2024, 10:35

పల్నాడు జిల్లాలో అంగన్వాడీ కార్యకర్త ఆత్మహత్య?

అంగన్ వాడీ సెంటర్ లో అంగన్ వాడీ కార్యకర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా శావల్య పురం మండలంలో బుధవారం సాయంత్రం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మతుకుమల్లి గ్రామంలోని చింతలపాడు బిసి కేంద్రంలో జ్యోతి ప్రసన్న అనే మహిళ అంగన్ వాడీ కార్యకర్తగా పని చేస్తుంది.

గత కొన్ని రోజుల నుంచి ఎపిలో అంగన్ వాడీ కార్యకర్తలు సమ్మె చేస్తున్నారు.సమ్మెను విరమించిన తరువాత బుధవారం ఆమె అంగన్ వాడీ కేంద్రానికి చేరుకొని పిల్లలకు పౌష్టికాహారం అందించారు.

సాయంత్రం నాలుగు గంటల తరువాత చిన్నారులను తీసుకొని వెళ్లాలని, సహాయకురాలికు సూచించారు. తనకు రికార్డులు రాసే పని ఉందని చెప్పారు.

రాత్రి 7.30 వరకు ఇంటికి రాకపోవడంతో ఆమె పిల్లలు, బంధువులు అంగన్ వాడీ కేంద్రం వద్దకు వెళ్లి చూడగా ఆమె ఉరేసు కున్నట్టు గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నిజంనిప్పులాంటిది

Jan 25 2024, 10:33

తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ

తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బుధవారం బదిలీ చేసింది.

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.

ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్‌ శ్రీధర్‌, పశుసంవర్ధకశాఖ సంయుక్త కార్యదర్శిగా అమోయ్‌ కుమార్‌, వైద్యారోగ్యశాఖ సంయుక్త కార్యదర్శిగా టీ వినయ్‌కృష్ణారెడ్డిని నియమించింది.

రోడ్లు భవనాలశాఖ సంయుక్త కార్యదర్శిగా హరీశ్‌, టీఎస్‌ఐఆర్‌డీ సీఈవోగా పీ కాత్యా యనిదేవి, గనులశాఖ డైరెక్టర్‌గా సుశీల్‌ కుమార్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది...

నిజంనిప్పులాంటిది

Jan 24 2024, 18:22

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని దురాశతో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తిని పెద్దపల్లి పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు.

నిందితుడి వద్ద నుంచి గంజాయి చాక్లెట్స్ స్వాధీనం చేసుకొన్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎస్‌ఐ మల్లేష్‌ మీడియాకు విరాలను వెల్లడించారు. పెద్దపెల్లి పట్టణానికి చెందిన అన్సారీ అనే వ్యక్తి కష్టపడకుండా డబ్బులు సంపాందించాలని తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు.

ఇందుకోసం కాలేజీలు ఎక్కువగా ఉన్న ఏరియాలను టార్గెట్‌గా చేసుకొని ఉత్తరప్రదేశ్ నుంచి గంజాయి చాక్లెట్స్‌ తెప్పించి విక్రయిస్తున్నాడని తెలిపారు.

విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం పట్టణంలోని అమర్ నగర్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు...

నిజంనిప్పులాంటిది

Jan 24 2024, 18:21

తహసిల్దార్ యోగేశ్వరి దేవి సస్పెండ్

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఇంచార్జి, బత్తలపల్లి తహసీల్దార్ యోగేశ్వరి దేవిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.

ఎస్సీ, ఎస్టీలకు చెందిన కోట్ల రూపాయల విలువైన భూములను అధికార పార్టీ నేతలకు ఇష్టారాజ్యంగా కట్టబెట్టిందని తహశీల్దార్ పై వచ్చిన అవినీతి, అరోపణలపై జరిగిన సమగ్ర విచారణ అనంతరం తహశీల్దార్ యోగేశ్వరి దేవిని సస్పెండ్ చేస్తున్న‌ట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

నిజంనిప్పులాంటిది

Jan 24 2024, 17:00

బీసీ ల చలో ఢిల్లీ : ఫిబ్రవరి 5 ,6 న

•బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్

ఫిబ్రవరి 5,6 తేదీలలో ఢిల్లీ లో జరిగే పార్లమెంటు ముట్టడికి బీసీ లందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని మిర్యాలగూడలో బీసీ యువజన సంఘం సమావేశంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ మాట్లాడుతూ భారతదేశ జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలకు జనాభా కి దగ్గట్లుగా రిజర్వేషన్ లేకపోవడం వలన బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.

స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల గడిచినప్పటికీ కూడా బీసీల బ్రతుకులు ఏమాత్రం మారలేదు బీసీ కుల గణన చేయాలి అని చెప్పేసి గత ఎంతో కాలంగా ఉద్యమం చేస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరం కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంతృత్వ శాఖను ఏర్పాటు చెయ్యాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరు కట్టినట్టుగా వ్యవహరిస్తుంది.

కేంద్ర ప్రభుత్వం ఇకనైనా స్పందించి బీసీల డిమాండ్లు సానుకూలంగా స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి బీసీ లందరూ సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు కార్యక్రమంలో ... ఆర్లపూడి శ్రీను, చిలకల మురళి యాదవ్, రాయించు నరసింహ, పగిళ్ల అనిల్, నరేష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

Jan 24 2024, 16:45

సీఎం మమతాబెనర్జీకి స్వల్పగాయం

పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ బుధవారం గాయపడ్డారు. ఆమె బుర్ద్వాన్‌లో సమావేశం ముగించుకుని కోల్‌కతాకు తిరిగి వస్తుండగా మమతా బెనర్జీ స్వల్పంగా గాయపడ్డారు.

సభాస్థలి నుంచి ప్రధాన రహదారిపైకి వస్తుండగా మమత కారు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేకులు వేసినట్లు సమాచారం. ఈ కుదుపు వల్ల కారులో ఉన్న సీఎం మమత నుదిటిపై స్వల్ప గాయమైంది.

కాసేపటికి కోలుకున్న ఆమె అదే కారులో కోల్‌కతాకు బయలుదేరారు...

నిజంనిప్పులాంటిది

Jan 24 2024, 16:08

అయోధ్య రాముడిని దర్శించుకున్న హనుమంతుడు

అయోధ్య రాముడిని చూసేందుకు హనుమంతుడే అయోధ్యకు వచ్చాడంటూ ఆలయ ట్రస్ట్‌ శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర సోషల్‌ మీడియా ద్వారా తెలిపింది.

ఆయోధ్యలో నిర్మించిన రామ మందిరంలో బాలరాముడు కొలువుదీరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం రామ్‌ లల్లా దర్శనానికి వానరం దక్షిణ ద్వారం గుండా గర్భగుడి లోకి ప్రవేశించింది.

విగ్రహం వరకు వెళ్లడంతో సిబ్బంది పట్టకునేందుకు చూడగా ఉత్తర ద్వారం వైపు వెళ్లిపోయినట్లు ఆలయ అధికారులు తెలిపారు..